దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న డీకే అరుణ సోమవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేసారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా గుల్బర్గా జిల్లా చిట్టాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియంక్ ఖర్గే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, మోడీ కి జరిగే నష్టం ఏమి లేదని ఆమె వెల్లడించారు.
Also Read : Rohit Sharma: రోహిత్ శర్మ ఔటా? నాటౌటా? ఇదిగో సాక్ష్యం!
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మెప్పించలేక, ఒప్పించలేక మోడీ పై అక్కసును కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇది దేశ ప్రజలంత గమనిస్తున్నారని డీకే అరుణ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకుని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు ఎంత తన పై నోరు పారేసుకున్నా వాటిని తాను ఆశీర్వాదములా స్వీకరిస్తానని అని మోడీ అనడం అది తనకున్న పెద్ద మనసుకు నిదర్శనమని డీకే అరుణ కొనియాడారు. అసలు నరేంద్ర మోడీని అనే స్థాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు లేదని, ప్రియాంక్ ఖర్గే తన మాటలను వెన్నక్కి తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.
Also Read : Nabha Natesh: ఏం.. పాప.. అవకాశాలు లేవా.. ఏంటీ ఈ చూపించడం