Karnataka : ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ పోస్టులకు 100శాతం కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు.
కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయిత
శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
Karnataka: బెంగళూర్‌లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది.
కర్ణాటక అసెంబ్లీ భవనం (విధాన సౌధ)లో ముస్లింల కోసం ప్రార్థన గదిని కోరుతూ జనతాదళ్ (సెక్యులర్) లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) సభ్యుడు బీఎం ఫరూక్ ఎగువ సభ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే నమాజ్ చేసేందుకు గది కావాలని కోరగా.. ఛైర్మన్ స్పందించలేదు.
కర్ణాటక అసెంబ్లీలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటీవల ఓ సామాన్య వ్యక్తి విధాన సౌధలోకి వచ్చి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
శివాజీనగర్ నుంచి లింగరాజపురం వెళ్తున్న బీఎంటీసీ బస్సు రావడంతో టక్కున బస్సు ఎక్కి అందులో ఉన్న విద్యార్థులకు, ప్రయాణికులకు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. లింగరాజపురం బస్సులో ఉన్న విద్యార్థులు, మహిళలతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణించి వారి సమస్యను తెలుసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.