కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై వాయిస్ నివేదికను ఎఫ్ఎస్ఎల్‌కి పంపగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన మునవర్, హవేరీలోని బ్యాడగికి చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు.
Kodali Nani: జన సైనికులే చంద్రబాబును పాతాళానికి తొక్కేస్తారు..
అంతకుముందు.. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక.. వీడియో, ఆడియో రెండింటిలోనూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఉన్నట్లు ధృవీకరించింది. అంతేకాకుండా.. ఫుటేజీలో అవకతవకలు జరగలేదని పేర్కొంది. కాగా.. “ఫిబ్రవరి 27న, కర్ణాటక అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
PM Modi: హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటన.. సిటీలో హై అలర్ట్
రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఫోరెన్సిక్ నివేదికపై చర్చించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధ భద్రతా డీసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. విధానసౌధలోకి చాలా మందిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ అంశంపై విపక్ష బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత ఆర్.అశోక ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ మార్చ్ చేపట్టారు.