Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: తెలంగాణలో పందెం కోడి కేసు హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు రోజులుగా కోడి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇవాళ కోడి వేలం పాటకు ఆర్టీసీ అధికారులు టైం ఫిక్స్ చేశారు. అయితే కోడి విషయంలో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కోడి నాదే అంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ అధికారులను కోరడంతో సంచలనంగా మారింది. ఆ కోడి నాదే సార్ నాకోడి నాకు ఇచ్చేయండి అంటూ తెలిపాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి కోడి నాదే.. నాకు అప్పగించాలని ముందుకు వచ్చాడు. మహేష్ రుద్రంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోడిని అప్పగించాలని మహేష్ కోరుతున్నాడు. అంతేకాకుండా అతను తన ఇంట్లో, పెరట్లో కోడి తిరుగుతున్న వీడియోలతో సహా పంపించడం గమనార్హం. ఈ కోడి నాదే అంటూ వీడియోలు, ఫోటోలు పంపించినా ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. నీదే అని గ్యారెంటీ ఏమిటి? కోడిని నీకు ఇచ్చేదే లేదని ఖరా ఖండిగా చెప్పేశారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇవాళ మధ్నాహ్నం వేలం వేస్తున్నామంటే నీకోడి అని గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. కోడిని ఇచ్చేదే లేదని స్పస్టం చేశారు.
Read also: Supreme Court: ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ
Also Read
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
కోడి కేసులో అటు కోడి యజమాని, ఇటు కోడిని బంధించి ఆర్టీసీ యాజమాన్యం పెద్ద చిక్కేవచ్చిపడింది. మరి ఆ కోడిని యజమాని మహేష్ కు ఇస్తారా? లేక మధ్నాహ్నం 3 గంటలకు వేలంపాటలో మహేష్ పాల్గొని వేలంపాట పాడి తీసుకోమంటారా? అనే ప్రశ్నలు లేవలెత్తున్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ రాకపోవడం, దానికి తోడు రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రావడంతో ఆర్టీసీ దీనిని వేలం వేసేందుకు సిద్దమయ్యింది. కోడి వేలం వేసేందుకు ఇవాళ మధ్నాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోడి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. ఆ కోడి నాదే.. నా కోడిని నాకే ఇచ్చేయండి అంటూ ముందుకు రావడంతో ఆర్టీసీ యజమానులు షాక్ తిన్నారు. మరి ఇప్పుడు కోడి విషయంలో ఆర్టీసీ అధికారులు ఎలా స్పందించానున్నారో వేచి చూడాలి.
Trending News : నా వయసు 112ఏళ్లే… నాకు మొగుడు కావాలి.. కానీ నాదో కండీషన్..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?