కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
Karimnagar: సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. తల్లి ప్రేమకు అద్దంపట్టే హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందినప్పటి నుంచి తల్లి లచ్చమ్మ మనస్థాపానికి గురైంది. నిత్యం కొడుకు సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తూ జీవితం గడిపింది. గత వారం క్రితం కొడుకు సమాధి వద్దకార్ పాలిష్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కరీంనగర్…
సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు క్రిష్ణా రామా అనుకుంటూ ఓ మూలన కూర్చుంటారు. కళ్లు కనిపించి కనిపించక, చెవులు వినిపించి వినిపించక .. నడవలేక నడవలేక నడుస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా ఎల్లమ్మ పాటకు డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. Read Also: Pakistan: 26/11 ముంబై దాడులపై బాంబ్ పేల్చిన పాక్ అధ్యక్షుడి సహాయకుడు.. పూర్తి వివరాల్లోకి…
Suicide: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మంగళవారం జరిగిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో సార్ కొట్టాడని ఆరోపిస్తూ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. బాధితులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. Daggupati Prasad: ఎమ్మెల్యే…
ఇంటి పన్ను వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ చూపిస్తున్న శ్రద్ధ, రోడ్ల మరమ్మత్తులో చూపడం లేదంటూ కరీంనగర్ ప్రజలు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, వాటిలో వరి నాట్లు వేస్తూ 9వ డివిజన్‌లోని నివాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన ఘటన చోటు చేసుకుంది. గతకొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లేక వాహనదారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితికి చేరుకుంది. ప్రస్తుతం బ్రిడ్జిపై బట్టలు ఆరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు అరేసుకోడానికా అంటూ నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో “సైకిళ్ల పంపిణీ” కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తిని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ అన్నారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్ కు ఇది చిన్న ఉదాహరణ…
MLA Sanjay : కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. నిన్న జరిగింది అధికారిక సమావేశమని, నన్ను కౌశిక్ రెడ్టి చేతితో దొబ్బేసాడన్నారు. నిన్నటి మీటింగ్‌లో కౌశిక్ రెడ్టి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. నిన్నటి సమావేశంలో కౌశిక్ నన్ను నెట్టివేసాడని, కౌశిక్ రెడ్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ఆయన…
Karimnagar: ఫుడ్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి.
Heart Attack: ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు.