Karimnagar: సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. తల్లి ప్రేమకు అద్దంపట్టే హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందినప్పటి నుంచి తల్లి లచ్చమ్మ మనస్థాపానికి గురైంది. నిత్యం కొడుకు సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తూ జీవితం గడిపింది. గత వారం క్రితం కొడుకు సమాధి వద్దకార్ పాలిష్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
READ MORE: Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్! థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్
వాస్తవానికి సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైన ఉందంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే.. ఎందుకంటే ఆ ప్రేమలో ఎలాంటి స్వర్థం ఉండదు. ప్రతి ఒక్క తల్లి తన పిల్లలే జీవితంగా బతుకుతుంది. తాను తిన్నా తినుకున్నా పిల్లలకు మాత్రం పెడుతుంది. ప్రస్తుతం వీణవంక మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సైతం తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.