Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిమ్మాపూర్ లో అక్రమంగా నిర్మించిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు సబ్ రిజిస్టర్ పై ఒత్తిడి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధమని సబ్ రిజిస్ట్రార్ నిరంజన్ చెప్పడంతో అతడిపై డబ్బులు చల్లి ఏసీబీకి ఫిర్యాదు చేశామని నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై సబ్ రిజిస్టర్ నిరంజన్ పోలీస్ స్టేషన్‌లో కాపాడి కొమురయ్య, ఊప్పు రవీందర్, ఏడ్ల జోగిరెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Read Also: Blindsight: మస్క్ ఆవిష్కరణలో పురోగతి.. పుట్టుకతోనే చూపులేని వారు ఇప్పుడు ప్రపంచాన్ని చూడొచ్చు!
ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వారికి వదిలి పెట్టొద్దని పేర్కొంటున్న కామెంట్స్ పెడుతున్నారు.