Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో “సైకిళ్ల పంపిణీ” కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తిని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ అన్నారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్ కు ఇది చిన్న ఉదాహరణ అని తెలిపారు.
Read Also:EBOO Therapy Treatment: డాక్టర్ ధీరజ్ ‘పెయిన్ రిలీఫ్ & వెల్‌నెస్ సెంటర్’లో EBOO థెరపీ ప్రారంభం
అలాగే, నేను మీలాగే పేదరికం నుంచి వచ్చిన వాడినే.. తిండికి ఇబ్బందులు పడ్డ రోజులు నాకు ఉన్నాయి. కానీ, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చారని భావోద్వేగంగా స్పందించారు. “తల దించుకుని చదవండి.. తలెత్తుకునే స్థాయికి చేరండి” అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు పెట్టుకోండి, మీరు చదువులో పైకి వెళ్లాలి. నేనంటే అభిమానించే పిల్లలే నా గెలుపుకు ప్రధాన కారణం. 50 శాతం ఓట్లు వారి వల్లే వచ్చాయి. పిల్లలపై మీరు చూపుతున్న ప్రేమకి నేను ఏం ఇచ్చినా రుణం తీరదని తెలిపారు.
Read Also:Kishan Reddy: ప్రతి పైసాకు అకౌంటబిలిటీ.. మరింత పారదర్శకంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..!
బండి సంజయ్ తమ ఎంపీ పదవిలో ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ పిల్లలకు సైకిళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, త్వరలోనే ప్రతి విద్యార్థికి ‘మోదీ కిట్’ను అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. “సైకిల్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు ప్రతీక” అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో కేంద్ర మంత్రిని ఎమ్మెల్సీ కొమరయ్య ఘనంగా సత్కరించారు. రాబోయే నెల రోజుల్లోనే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పూర్తి చేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.