MLA Sanjay : కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. నిన్న జరిగింది అధికారిక సమావేశమని, నన్ను కౌశిక్ రెడ్టి చేతితో దొబ్బేసాడన్నారు. నిన్నటి మీటింగ్‌లో కౌశిక్ రెడ్టి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. నిన్నటి సమావేశంలో కౌశిక్ నన్ను నెట్టివేసాడని, కౌశిక్ రెడ్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ఆయన ప్రశ్నించారు. నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదన్నారు. కౌశిక్ రెడ్టి రాజకీయాల్లోకి రాకముందే అయనపై కేసులు ఉన్నాయని, కౌశిక్ రెడ్టికి అందరినీ బెదిరించడం అలవాటని ఆరోపించారు ఎమ్మెల్యే సంజయ్. వరంగల్‌లో ఇలాగే బెదిరించి సెటిల్మెంటు చేసాడని, ఆయన తీరుపై స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసాను… స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలన్నారు.
Reward For Having 4 Children: బంపర్ ఆఫర్.. నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి.. ఎక్కడంటే?
అంతేకాకుండా..’కౌశిక్ రెడ్టి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుదామనుకుంటే నాకు అటంకం కలిగించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం. కాంగ్రెస్ పార్టీతో నేను కలిసి పనిచేస్తే ఇంత అక్కసు ఎందుకు? కౌశిక్ రెడ్టి నేపథ్యం అందరికీ తెలుసు. నన్ను అనేముందు కౌశిక్ రెడ్టి ఎన్ని పార్టీలు మారారో తెలుసుకోవాలి. నాకు అండగా నిలిచివారందరికి ధన్యవాదాలు. కౌశిక్ రెడ్టి నాపై దాడి చేయడాన్ని నేను బాధతో ఖండిస్తున్నాను. నాపై కౌశిక్ రెడ్డి మాటలతో, చేతులతో దాడి చేసారని స్పీకర్ ని కలిసి వివరించాను. గతంలో వేరువేరు పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారిని రాజీనామా చేయించారా?. గతంలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ క్షమాపణ చెబితే .. నేను రాజీనామా చేస్తా. గంగుల కమలాకర్ నాకు మిత్రుడు. ఆయన చేసిన కామెంట్స్ పైన ఎవరో చెబితే చేశాడు. తప్ప ఆయన గుండెలో నుంచి వచ్చిన మాటలు కాదు.’ అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
China Manja : పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత