సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు క్రిష్ణా రామా అనుకుంటూ ఓ మూలన కూర్చుంటారు. కళ్లు కనిపించి కనిపించక, చెవులు వినిపించి వినిపించక .. నడవలేక నడవలేక నడుస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా ఎల్లమ్మ పాటకు డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Read Also: Pakistan: 26/11 ముంబై దాడులపై బాంబ్ పేల్చిన పాక్ అధ్యక్షుడి సహాయకుడు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఎల్లమ్మ పాటకు డ్యాన్స్ వేస్తూ.. అందిరిని ఆకట్టుకుంది. ఎదో ఫంక్షన్ అయ్యాక పాటలు పెట్టుకొని అందరూ చిందేస్తుంటే.. ఎల్లమ్మ పాటకు ఆ బామ్మ కూడా సూపర్ గా చిందేసింది. అక్కడున్నవాళ్ళు చప్పట్లు, ఈళలతో మరింత హుషారెత్తించారు. దీంతో ముసాలామె కూడా పొట్టు పొట్టు ఎగిరింది. కొందరైతే.. భామ్మ పై నుంచి డబ్బులు కూడా తిప్పారు. అయితే ఈ డ్యాన్స్ ను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు కొందరు వ్యక్తులు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. భామ్మ ఈ ఏజ్ లో నే ఇలా ఉంటే.. ఆ రోజుల్లో చింపేసుంటావు అంటావు.. కామెంట్లు పెడుతున్నారు.