Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్‌మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది. కరాచీ నగరంలో 40 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా అనేక గ్రిడ్ స్టేషన్లు విఫలమయ్యాయని అక్కడి మీడియా వెల్లడించింది.
Read Also: H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్‌తో మరొకరు మృతి.. 7కు చేరిన మరణాల సంఖ్య
కరాచీలోని నుమాయిష్ నుమాయిష్ చౌరంగి, సద్దర్, లైన్స్ ఏరియా, పంజాబ్ కాలనీ, గులిస్తాన్-ఎ-జౌహర్ మరియు కోరంగి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న కే ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మంగళవారం ఉదయం 7.34 గంటలకు నేషనల్ గ్రిడ్ ఫ్రీకెన్సీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నేషనల్ గ్రిడ్ ప్రీక్వెన్సీలో హెచ్చతగ్గుల మూలంగా పాకిస్తాన్ లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. జనవరి నెలలో కరాచీ నగరం ఇలాగే అంధకారంలో చిక్కుకుంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.