Pakistan: మహిళల శవాలపై అత్యాచారం.. సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తోంది. ఇక రాజకీయంగా అస్థిరత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తోంది. పాకిస్తాన్ లోని తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చనిపోయిన కూతుళ్ల శవాలపై అత్యాచారాలకు ఒడిగట్టకుండా తల్లిదండ్రులు సమాధులకు తాళాలు వేస్తున్నారని డైలీ టైమ్స్ వెల్లడించింది. దేశంలో ‘‘నెక్రోఫిలియా’’ కేసులు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
కొంతమంది కామాంధులు తమ లైంగిక కోరికలను తీర్చుకునేందుకు ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటివి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమవారి శవాలను అపవిత్రం కాకుండా సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011లో పాకిస్తాన్ లో తొలి నెక్రోఫిలియా కేసు నమోదైంది. కరాచీలోని ఉత్తర నజీమాబాద్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే కాటికాపరి 48 మహిళ శవాలపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత అతడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Read Also: Anji Khad bridge: ఇండియాలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన సిద్ధం.. ఎక్కడంటే..?
ఇటీవల మే 2022లో, పాకిస్థాన్‌లోని గుజ్రాత్ ప్రాంతంలోని చక్ కమలా గ్రామంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు టీనేజ్ బాలిక శవాన్ని తవ్వి, అత్యాచారం చేశారు. సదరు అమ్మాయిని ఖననం చేసిన ఆదే రోజు రాత్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక సమాధికి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు బంధువులు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శవంపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 2021లో ఇలాగే కోస్టల్ టౌన్ గులాముల్లా సమీపంలో మౌల్వీ అష్రఫ్ చండియో గ్రామంలో కూడా ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడ్డారు.
2020లో పాకిస్తాన్ పంజాబ్ లోని స్మశాన వాటికలో ఒక మహిళ శవాన్ని రేప్ చేస్తున్న క్రమంలో నిందితుడిని పట్టుకున్నారు. 2019లో కరాచీలోని లాంధీ టౌక్ లో ఒక మహిళ మృతదేహాన్ని తవ్వి అత్యాచారానికి పాల్పడ్డారు. 2013లో గుజ్రాన్ వాలాలో 15 ఏళ్ల బాలిక మృతదేహన్ని సమాధి నుంచి తీసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తతం ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!