పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుసహా ఒక మహిళ ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ-లాహోర్ రైలులోని ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టండో మస్తీఖాన్ స్టేషన్‌లో రైలును ఆపి కాలిపోతున్న బోగీని వేరు చేశాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:CSK vs RR : భారీ స్కోర్ చేసిన రాజస్థాన్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?
సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల (300 మైళ్లు) దూరంలో ఉన్న ఖైర్‌పూర్‌లో రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారి మొహ్సిన్ సియాల్ తెలిపారు. కదులుతున్న రైలు కిటికీలోంచి దూకి ఓ మహిళ చనిపోగా మంటల్లో ఆరుగురు మృతి చెందారని తెలిపారు.తెల్లవారుజామున 1:50 గంటలకు మొదటి అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 40 నిమిషాల శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారి తెలిపారు.
కాగా, పాకిస్తాన్‌లో నిరుపేద ప్రయాణీకులు తరచూ తమ భోజనం వండుకోవడానికి రైళ్లలో తమ సొంత చిన్న గ్యాస్ స్టవ్‌లను తీసుకువస్తారు. వాటిని రైళ్లలో తీసుకెళ్లేందుకు నిషేధం ఉన్నప్పటికీ.. అధికారల నిర్లక్ష్యం కారణంగా తరచు రైళ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
Also Read:INDGAP Certification : ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్