Old Bridge Collapse: కాన్పూర్‌లో దాదాపు 150 ఏళ్ల నాటి గంగా వంతెనలో కొంత భాగం ఈ ఉదయం (మంగళవారం) కూలిపోయింది. స్వాతంత్య్ర పోరాటానికి సాక్షిగా నిలిచిన ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్‌ను లక్నోతో కలుపుతూ ఉండేది. అయితే, ఈ వంతెనను కాన్పూర్ పరిపాలన నాలుగు సంవత్సరాల క్రితం ట్రాఫిక్ దృష్ట్యా మూసివేసింది. గంగా వంతెనకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అందుకే, మున్సిపల్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. వారసత్వ సంపదగా చూపేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరీకరణ…
ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్‌లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్‌లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు…
కాన్పూర్‌లోని బాబు పుర్వా ప్రాంతంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఫర్నీస్‌లో వండుతున్న పాల బాండీలో పడిపోయాడు. దీంతో తీవ్రంగా కాలిపోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. సుమేర్‌పూర్ జిల్లా హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ కూడలి సమీపంలోని హరి ఓం స్వీట్స్ దుకాణం వద్ద పాలపాన్ సమీపంలోకి వచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మొసలి నివాసల దగ్గర హల్‌చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని తాళ్లతో బంధించి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Gas Cylinder on railway track: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో మరోసారి రైలు దుర్ఘటనకు కుట్ర పన్నిన ఘటన వెలుగు చూసింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్ కనుగొనబడింది. ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచారు. దీంతో పాటు రైల్వే లైన్ సమీపంలో పెట్రోల్, గన్ పౌడర్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్‌లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Kanpur: తన కూతురితో కలిసి తిరుగుతున్న యువకుడిపై ఓ తండ్రి దారుణంగా వ్యవహరించాడు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన లాయర్ తన కుమార్తెతో కలిసి తిరుగున్న ఫార్మా విద్యార్థిని కిడ్నాప్ చేయించి, అతని మనుషులతో దారుణంగా చిత్రహింసలు పెట్టాడు.