ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మొసలి నివాసల దగ్గర హల్‌చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని తాళ్లతో బంధించి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ దగ్గర మొసలి ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు మొసలిని బంధించారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మక్డిఖేడాలోని సూర్య విహార్ సొసైటీలో జరిగింది. తాడులతో కట్టబడి, నోరు వెడల్పుగా తెరిచి ఉంది. చుట్టూ భారీగా జనం గుమిగూడి ఫొటోలు దిగారు.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపులు..
చిన్నారుల బృందం క్రికెట్ ఆడుతుండగా కాలువలోంచి మొసలి బయటకు రావడాన్ని గమనించి ప్రజలకు సమాచారం అందించారు. అనంతరం వారు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు రంగంలోకి దిగి కొన్ని గంటల పాటు శ్రమించిన స్థానికులు సాయంతో తాడుతో బందించి పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులు స్థానిక జూకు తరలించారు. మొసలి దొరికిన ప్రాంతం గంగా నదికి సమీపంలో ఉంది. వర్షాకాలంలో తరచుగా నివాస గృహాల దగ్గరకు వస్తుంటాయి.
ఇది కూడా చదవండి: BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..