Kanpur: సౌదీ అరేబియా నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై కాన్పూర్‌లోని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022లో సలీమ్‌ను వివాహం చేసుకుంది. అతడు ప్రస్తుతం సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
Uttar Pradesh: దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన అత్యాచార చట్టాలు ఉన్నా కామాంధులు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
IT Raids: కాన్పూర్‌లోని బడా పారిశ్రామికవేత్త మయూర్ గ్రూప్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం భారీ దాడులు నిర్వహించింది. కాన్పూర్‌లోనే కాకుండా కాన్పూర్-దేహత్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఇండోర్, దేవాస్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
కాన్పూర్‌లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్‌లకు మరణశిక్ష విధించింది.
Super Man: కాన్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి చిన్నారి దూకడం వీడియోలో కనిపిస్తోంది.
కాన్పూర్ లో గుట్కా ఫ్యాక్టరీ యజమాని ఒకరి ప్రాణాలను తీశాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం వివాదంలో కడతేర్చాడు. అతనికి రావల్సిన జీతం అడిగినందుకు.. యజమానితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటనపై గుట్కా ఫ్యాక్టరీ యజమాని, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Kanpur: ఉత్తర్ ప్రదేశ్ లో 100 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదైంది. కాటికి కాలి చాపే వయసులో పోలీస్ ఎఫ్ఐఆర్ లోకి ఎక్కింది. సరిగ్గా నడవడం రాని, కళ్లు సరిగ్గా కనిపించని 100 ఏళ్ల వృద్ధురాలు చంద్రకాళి రౌడీయిజం చలాయించింది. ఓ భూతగాదా విషయంలో ఆమెపై మాధురి అనే మహిళ కేసు పెట్టింది. ఈ వివాదంతో రూ.10 లక్షలు ఇవ్వాలని మాధురిని బెదిరించిందనే ఆరోపణలపై పోలీసులు వృద్దురాలి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.