Viral Video: మద్యం మత్తులో మరుగుతున్న పాలు మీదపడి వ్యక్తి మృతి (వీడియో)
- మరుగుతున్న పాలు మీద పడి వ్యక్తి మృతి
- మద్యం మత్తులో పాల పాన్ దగ్గరకు వచ్చిన వ్యక్తి
- మత్తులో దాన్ని ఢీ కొట్టడంతో మీద పడ్డ పాలు
- శనివారం రాత్రి ఘటన
- చికిత్స పొందుతూ నేడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్‌లోని బాబు పుర్వా ప్రాంతంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు ఫర్నీస్‌లో వండుతున్న పాల బాండీలో పడిపోయాడు. దీంతో తీవ్రంగా కాలిపోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు దుకాణంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. సుమేర్‌పూర్ జిల్లా హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ కూడలి సమీపంలోని హరి ఓం స్వీట్స్ దుకాణం వద్ద పాలపాన్ సమీపంలోకి వచ్చాడు. అప్పుడు అతడు మద్యం మత్తు ఉన్నాడు. ఈ సమయంలో, అతను పాల పాన్‌లో చేయి పెట్టాడు. పాన్ అతనిపై బోల్తా పడింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాబుపూర్వ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన మనోజ్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మనోజ్ మృతి చెందాడు. కుమారుడు కాన్పూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడని, శనివారం రాత్రి అల్పాహారం చేసేందుకు దుకాణానికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. పాల పాన్ అతనిపై ఎలా పడిందో తెలియడం లేదని వాపోయింది.
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
సాయంత్రం నుంచి మద్యం మత్తులో ఉన్నాడని షాపు యజమాని జితేంద్ర సాహు చెబుతున్నారు. అతను రెండుసార్లు షాప్ వైపు వచ్చినప్పుడు.. అతన్ని మందలించి పంపినట్లు తెలిపాడు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడి వచ్చాడని.. తాము షాప్‌లో బిజీగా ఉన్నామన్నాడు. అప్పుడు అతను తన చేతితో పాల బాండీని ఢీ కొట్టాడని.. దాని కారణంగా పాన్ పడిపోయిందని పేర్కొన్నాడు. దీంతో తాము అతడిపై నీళ్లు పోసి పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతన్ని అంబులెన్స్‌లో ఉర్సలాకు తీసుకెళ్లారన్నారు.
नशे में धुत युवक के ऊपर गिरी गर्म दूध की कढ़ाई, हुई दर्दनाक मौत pic.twitter.com/Ir2oMVVvRv
— Deepak Pandey (@deepakpandeynn) November 10, 2024
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?