ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
కెజిఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో కెర్స్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ తీస్తున్న చిత్రాలలో క్రేజియెస్ట్ కాంబో గా నిలిచింది మాత్రం ఎన్టీఆర్ తోనే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. …
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో…
మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు తనకు చచ్చిపోయినవాళ్లు నచ్చరు అని చెప్తాడు.. ఇంకొన్నిసార్లు చనిపోయినవాళ్లు దేవుళ్లు అంటూ వేదాంతం చెప్తాడు. ఇక తాజాగా ఈ దర్శకుడు సడెన్ గా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో దర్శనమిచ్చి షాక్ కి గురి చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటునితో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.…
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న రిలీజైన ట్రైలర్ కూడా రికార్డుల మోత మోగిస్తుంది. అన్ని భాషల్లో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి పాత రికార్డులను…
యావత్ సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కెజిఎఫ్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. బెంగుళూరులో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ వేదికపై హీరో యష్…
కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం. ఈ…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు…