మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించగా మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సరిగ్గా సినిమా రిలీజ్ కు రెండు వారాలు వున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార పర్వాన్ని మరింతగా హోరెత్తించడంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ప్రెస్ మీట్ లో హీరో యష్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి రవీనా టాండన్ సంజయ్ దత్ ఈ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్న ఎక్స్ ఎల్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత రితేష్ సిద్వానీ పాల్గొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లానే కెజిఎఫ్ 2 కూడా మరో రెండు వారలు ప్రమోషన్స్ తో అగ్గి రాజేయనున్నదన్నమాట..