వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు తనకు చచ్చిపోయినవాళ్లు నచ్చరు అని చెప్తాడు.. ఇంకొన్నిసార్లు చనిపోయినవాళ్లు దేవుళ్లు అంటూ వేదాంతం చెప్తాడు. ఇక తాజాగా ఈ దర్శకుడు సడెన్ గా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో దర్శనమిచ్చి షాక్ కి గురి చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటునితో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్, విశాల్, విజయ్ లాంటివారు ఆయన సమాధివద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు వర్మ. లెజెండరీ హీరో పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సార్.. మీరు మారిపోయారు సార్ .. అన్ని కొందరు అంటుండగా.. వర్మలో వేరే యాంగిల్ కూడా ఉంది .. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.