James: తెరపై పునీత్ ని చూస్తూనే ఆగిన అభిమాని గుండె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నంజనగూడు గ్రామానికి చెందిన ఆకాష్(22) కి పునీత్ అంటే ఎనలేని అభిమానం. ఆయన నటించిన ప్రతిసినిమాను చూస్తూ పెరిగాడు. ఇక ఇటీవలే ఆయన మృతిని జీరించుకోలేకపోయాడు.. అయినా అభిమానాన్ని చంపుకోలేకపోయాడు. తన ఫెవరెట్ హీరో చివరి చిత్రాన్ని చూడాలని స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. వెండితెరపై పునీత్ ని చూడగానే ఎమోటినల్ అయ్యాడు. ఆయన లేడు అన్న విషయం తలుచుకొని బాధపడ్డాడు. అలా తన అభిమాన హీరోను చూస్తూనే ఆకాష్ కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారు ఏమైంది అని చూసేలోపులోనే అతడు మృతిచెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. ఆకాష్ కి గుండెపోటు రావడంతోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అభిమాన హీరో మృతిని జీర్ణించుకోలేక అభిమాని గుండె ఆగడం ఎంతో విచారకరం అని, అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్పవాడని కన్నడ అభిమానులు కంటతడి పెడుతున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు