పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని…
కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఒక పక్క తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూనే మరో పక్క పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…
సంక్రాంతి పండగపూట కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని…
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఈ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ లేరనే విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు పునీత్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఈ ఏడాది ఆరంభంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ ఆరంభించాడు. సాహసోపేతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను పునీత్ తల్లి పార్వతమ్మరాజ్‌కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు. పునీత్ భార్య, చిత్ర…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని వదిలివెళ్లి వారం దాటింది. అయినా ఆ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణం విన్న అభిమానులలో కొంతమంది గుండె ఆగిపోయింది. ఇంకొంతమంది తమ అభిమాన హీరో లేనప్పుడు మేము ఎందుకు అంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ అభిమానుల ఆత్మహత్యలపై పునీత్ రాజ్ కుమార్ భార్య శ్రీమతి అశ్విని స్పందించారు. ఇలా అఘాయిత్యాలకు ఎవరు పాల్పడవద్దని ఆమె కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. “పునీత్…