కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ” మా మాట మన్నించి ట్రైలర్ ని లాంచ్ చేసిన స్టార్ హీరోలందరికి ధన్యవాదాలు. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా కష్టపడి పనిచేశారు. కెజిఎఫ్ ఫ్రాంచైజీ కోసం ఎనిమిదేళ్లు నాతో కలిసి ప్రయాణించిన వారందరికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఎనిమిదేళ్ల కష్టాన్ని దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకింతమిస్తున్నాను. ఆయన లేనిలోటును ఎవరు తీర్చలేరు..” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పునీత్ కి ఇది నిజమైన నివాళి అంటూ కన్నడిగులు ప్రశాంత్ నీల్ ని ప్రశంసిస్తున్నారు.