S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.
నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమాక్రాట్స్ తరుపున కమల్ హారిస్ పోటీ చేస్తున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.
రేపే (మంగళవారం) పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.
Donald Trump: అమెరికా దేశంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకుంది. అధ్యక్ష పదవికి పోటీపోటీగా డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ లు భారీగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ అని పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, డోనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బొరలో ఎన్నికల ర్యాలీని నిర్వహించాడు. ఇందులో…
ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీ రోల్ పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే అవకాశం ఉంది.
Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.
US President salary: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 4న యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి ఎంత ఉంటుంది..? ఏఏ సౌకర్యాటు ఉంటాయనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది.
Donald Trump Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 23 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తల మద్దతు లభించింది. ఈ ఆర్థికవేత్తలు కమలా హారిస్‌ను ఉద్దేశించి లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థపై కమలా హారిస్ విధానాలను 228 పదాల లేఖలో ఆర్థికవేత్తలు ప్రశంసించారు. కమలా హారిస్ విధానాలు చాలా బాగున్నాయన్నారు. జూన్ నెల ప్రారంభంలో, 15 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తలు అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రశంసించారు.…
అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను తెలిపింది.