US Elections 2024: మరో రెండు రోజుల్లో (నవంబర్ 5న) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలో నిలవగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధినిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రంప్, కమలా హారిస్ ల మధ్య నువ్వా, నేనా అనే రీతిలో ఉత్కంఠభరితంగా పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వలసదారులలో మెక్సికన్ల తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం పెరిగిపోతుంది.
Read Also: Gopichand : ‘నిన్న అమేజాన్ – నేడు ఆహా’లో ప్రత్యక్షమైన హిట్ సినిమా
అయితే, ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీ రోల్ పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే అవకాశం ఉంది. కాగా, 2022 లెక్కల ప్రకారం అమెరికాలో భారత సంతతికి చెందిన వారు సుమారు 52 లక్షల మంది నివసిస్తున్నారని సమాచారం. వీరు అత్యధికంగా కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఆరిజోనా రాష్ట్రాలలో నివాసం ఉంటున్నారు. ఇందులో దాదాపు 39 లక్షల మంది ప్రస్తుతం ఓటు హక్కును కలిగి ఉన్నారు. తాజాగా జరుగనున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ భవిత్యాన్ని నిర్ధేశించ గల సామర్థ్యం భారత సంతతి ఓటర్ల చేతుల్లో ఉంది. వీరు ఎవరికి ఓటు వేస్తే, వారికి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెరుగవుతాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.