Elon Musk Claims Kamala Harris Team Is Planning to Suppress X platform: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, మోర్గాన్ మెక్ స్వీనీ ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే…
Bill Gates-Kamala Harris: మరో కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ కార్యక్రమంలో కమలా హరీస్‌కు మద్దతుగా ఉన్న ఎన్జీవోకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో…
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.
AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది.
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బరిలో ఉన్నారు. నవంబర్‌లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Donald Trump: నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.