US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇద్దరు అభ్యర్థులు విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ సపోర్టు కూడగట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై పలు సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి.
Read Also: Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. పోలీసుల కస్టడీలో నోరుమెదపని కిలాడీ లేడి..!
ఇక, అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను తెలిపింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ నడుస్తుంది. తాజా సర్వే ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌కు 47 శాతం, హారీస్‌కు 45 శాతం మంది ఆదరణ లభించినట్లు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Read Also: Prabhas : రెండు పాత్రలు.. మూడు గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్
అయితే, ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై మరోకరు విరుచుకుపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదు.. ఆయనో నియంత అని కమలా హరీస్ తీవ్ర ఆరోపణలు చేయగా.. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా చెడుగుడు ఆడుకుంటుంది అన్నారు. ఆమెను చిన్న పిల్లను చేసి డ్రాగన్ కంట్రీ జిన్‌పింగ్ గేమ్ ఆడుకుంటారని ట్రంప్ సెటైర్లు వేశారు.