విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్యామియో పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమ తెలుగు రైట్స్ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ దక్కించుకొని హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ కోసం ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణే రంగంలోకి దిగడం సంచలనం సృష్టిస్తోంది. ‘విక్రమ్’ తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి విశేష స్పందన వస్తోంది. మరి తెలుగు ట్రైలర్ ఏ లెవెల్లో ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
It’s our pleasure to announce that #MegaPowerStar @AlwaysRamCharan will be releasing the Telugu Trailer today at 5 PM !!!!!
Gear up for the fiery ride🔥#KamalHaasan #VikramHitlistTrailer@ikamalhaasan @Dir_Lokesh @actor_nithiin pic.twitter.com/65GBPFJgLI— Raaj Kamal Films International (@RKFI) May 20, 2022