లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “విక్రమ్”. సౌత్‌లో అత్యంత అంచనాలు ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ‘విక్రమ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అందులో కమల్ హాసన్ కిల్లర్ లుక్ లో సూట్ ధరించి, తుపాకీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక సినిమా విడుదల తేదీ విషయానికొస్తే… మార్చి 14న ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామంటూ ప్రేక్షకులను సస్పెన్స్ లో పెట్టేశారు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Read Also : Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషిస్తున్నాడు. మరోవైపు 110 రోజుల చిత్రీకరణ తర్వాత ‘విక్రమ్’ షూటింగ్ ముగిసింది. వాస్తవానికి ‘విక్రమ్’ కోసం తన షూటింగ్ కమిట్‌మెంట్స్ ను పూర్తి చేయడానికి కమల్ హాసన్ బిగ్ బాస్ అల్టిమేట్ నుండి హోస్ట్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఇక శివానీ నారాయణన్, కాళిదాస్ జయరామ్, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్ తదితరులు ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.