Kamal Haasan: హిందీ వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. అల్టిమేటమ్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్- సౌత్ కు మాటల యుద్ధం జరుగుతున్నా విషయం విదితమే. బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలపై విరుచుకుపడుతున్నారు. తమ సినిమాలు కనీసం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లు అందుకోవడం వారికి కన్ను కుట్టినట్లవుతోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీపై పలువురు పలు వివాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటికి సౌత్ యాక్టర్స్ కౌంటర్లు ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. ఇటీవల ఆయన నటించిన విక్రమ్ సినిమా ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ లో ఈ వివాదంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
” సినిమా.. రాజకీయాలు కవల పిల్లలు..అదే నేను చేస్తున్నా. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా భాధ్యత. దీనికి ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కొంటా. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను హిందీని వ్యతిరేకించడం లేదు.. అలా అని తమిళ్ భాష జోలికి వస్తే ఊరుకోను. చిన్నతనంలో శివాజీ గణేషన్ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని. అలా తనకు తొలి గురువు ఆయన అయితే రెండవ గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను. అందుకే తమిళ్ ఎప్పుడూ వర్ధిల్లాలి. దాంతో పాటు అన్ని భాషలు నేర్చుకోవాలి. అన్ని భాషలు కలిస్తేనే ఇండియా “అని కమల్ అల్టిమేటం జారీ చేశారు. మరి కమల్ వ్యాఖ్యలకు బాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?