కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్‌ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.
Read Also : Radhe Shyam : నెటిజన్లకు క్లాస్ పీకిన సినిమాటోగ్రాఫర్… విమర్శలపై ఫైర్
ఇక విషయంలోకి వస్తే బిగ్గెస్ట్ యాక్షన్ అంటూ ‘విక్రమ్’ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో సినిమాలోని పలు ఆసక్తికర సన్నివేశాల మేకింగ్ ఉంది. అలాగే “విక్రమ్” మూవీని ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ భారీ అంచనాలున్న చిత్రం వేసవిలో ప్రేక్షకులను అలరించబోతోంది. దీంతో ముగ్గురు స్టార్ హీరోల అభిమానులు సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఎస్.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ “ఇండియన్ 2″లో కూడా కనిపించనున్నాడు.