Vikram Trailer: కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసు మళ్లినా కమల్ హాసన్ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హిట్ సినిమా కోసం కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ నుంచి ఇటీవల విడుదలైన మేకింగ్ గ్లింప్స్ వరకు అన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మరో అప్‌డేట్ ప్రకటించింది.
విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 15న చెన్నైలో జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా అదే రోజు ట్రైలర్ కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. కమల్‌హాసన్ కెరీర్‌లో 232వ సినిమాగా ‘విక్రమ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ఈ మూవీ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 18న పారిస్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబోతున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
#KamalHaasan #VikramFromJune3 #VikramAudioLaunch #VikramTrailer@ikamalhaasan @Udhaystalin @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl #FahadhFaasil #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_ @DisneyPlusHS @vijaytelevision @disneyplusHSTam https://t.co/Vstu14TaBd
— Raaj Kamal Films International (@RKFI) May 10, 2022
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!