ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ రోజు పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. వైఎస్ ఆర్టీపీ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న హైడ్రామా కొనసాగింది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.