టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఎంతో బిజీబిజీగా గడిపారు. అంతేకాకుండా అమెరికాలో తన జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు. అయితే కేటీఆర్ సోదరి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా అమెరికాలోనే విద్యనభ్యసిస్తున్నాడు. అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్.. తన మేనల్లుడు ఆదిత్యను కలిసి కొంతసేపు గడిపారు. ఈ సందర్భంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను…
Telangana Legislative Council Live Updates. మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కార్యాలయం పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బస్సుల సంఖ్య తగ్గించకుండా ప్రజా రవాణాను అందరికి అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి పడిన రెండు పీఆర్సీలు, రెండు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు.…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…
కోవిడ్ -19 ఫస్ట్ వేవ్ సమయంలో ఆకస్మిక లాక్‌డౌన్ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేలాది మంది వలస కార్మికులను క్లిష్టమైన కోవిడ్ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ఆరోపించారు. కవిత తన ట్విట్టర్ హ్యాండిల్‌లో “కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఇది మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, గందరగోళానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని వలస కార్మికుల కష్టాలను కేసీఆర్ అర్థం చేసుకుని వారికి అండగా…
నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో లేకపోవడంతో… టీఆర్‌ఎస్ పార్టీ ఏక గ్రీవంగా విజయం సాధించింది. అయితే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక…
టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి? రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు? అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు.…