ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వెనుక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు.
బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా... తెలంగాణ సమాజం అంటారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.