Notices to MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు CRPC 91 నోటీస్.. ఎందుకు ఇస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా నిన్న హైదరాబాదులోని TRS MLC కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి అనేక వివరాలు సేకరించింది. అయితే.. నిన్న (సోమవారం) సుదీర్ఘ విచారణ తర్వాత.. సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీంతో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి.. కేవలం కేసుకు సంబంధించిన వివరణ కోసం మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు సాక్షి దగ్గరున్న ఆధారాలు సమర్పించాలని సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసుల ద్వారా కోరినట్టు సమాచారం.
అయితే ,ఆ వివరాలు ఎప్పటివరకు సమర్పించాల్సి ఉంటుందన్న తేదీని మాత్రం ఇంకా చెప్పలేదు. ఈ సందర్భంగా.. ఈ నోటీసుల కింద సాక్షి దగ్గర కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా తమకు సమర్పించాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో సమర్పించిన ఆధారాలకు సంబంధించి అధికారులకు ఏమైనా సందేహాలుంటే మాత్రం మళ్లీ నోటీసులిచ్చి విచారించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈకేసులో కవితను ఇరికించే విధంగా ఆధారాలు అడిగితే మాత్రం కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
CRPC 91 ఎందుకు ఇస్తారు అంటే?
91 సీఆర్పీసీ ప్రకారం సీబీఐ చెప్పినచోట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. అడిగిన పత్రాలు, ఆధారాలు కచ్చితంగా సమర్పించాలి. ఇక ఈ నోటోసులు ఎవరు అందుకుంటే వాళ్లే హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో.. విచారణ తేదీ, స్థలం మెయిల్ ద్వారా తెలియజేస్తామని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవిత దగ్గర ఆధారాలున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ఈ స్కామ్‌తో సంబంధమున్న 30 మంది కేసుకు సంబంధించిన ఆధారాలున్న 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అందులో కవితకు సంబంధించిన 10 మొబైల్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు విషయంలో కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కవిత దగ్గరున్న ఆధారాలను సమర్పించేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ఆధారాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
అయితే.. 91 సీఆర్పీసీ సబ్‌క్లాజ్-2 ప్రకారమైతే..సీబీఐ ఆఫీసుకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని విశ్లేషకుల మాట. ఇక, మరోవైపు సీఆర్పీసీ 91 నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎలా స్పందిస్తారు..? దీంతో.. సీబీఐ అడిగిన ఆధారాలు సమర్పిస్తారా..? లేదా.. రెండోసారి చెప్పిన ప్లేస్‌కి విచారణకు వెళ్తారా..? లేదా ఆమె మళ్లీ న్యాయనిపుణుల సలహా తీసుకుంటారా..? అనే దానిపై బీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!