KCR Enquiry: తెలంగాణలో అత్యంత కీలకమైన విచారణలకు వేదికగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నేడు (జూన్ 11) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరవుతున్నారు. ఈ విచారణ రాజకీయంగా, పరిపాలనా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. Read Also: Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’ ఇక విచారణకు ముందుగా ఎర్రవల్లి…
ACB Raids: తెలంగాణలో భారీ అవినీతికి సంబంధించి మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రస్తుతం చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇరిగేషన్ CAD డివిజన్ 8లో పనిచేశారు. ఆయన…
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు వెళ్లనున్నారు.
తెలంగాణ తాజా రాజకీయం మొత్తం... కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో... ఇప్పుడు పొలిటికల్ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును…
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకు వెళ్లిన హరీష్ రావు.. కేసీఆర్‌ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరైనట్టు…
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఓపెన్ కోర్ట్‌లో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, హరీష్ రావును సుమారు 40 నిమిషాల పాటు విచారించింది. ప్రారంభంలో ఆయనను “నిజాలే చెప్తానని” ప్రమాణం చేయించి ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది. కమిషన్ ప్రశ్నలు vs హరీష్ రావు సమాధానాలు కమిషన్: ఇరిగేషన్ మంత్రిగా మీరు ఎన్ని రోజులు పనిచేశారు? హరీష్ రావు: నేను సుమారు…
Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు…
Minister Uttam: బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ఆర్ధిక నష్టం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.