KCR Enquiry: తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నింపే పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. నేటి ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఓపెన్ కోర్ట్‌లో విచారించాలని కమీషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనను మినహాయించి అందరిని అక్కడి నుండి బయటకు పంపించిన అనంతరం వన్ టు వన్ విచారణకు సిద్ధమయ్యారు. కోర్టు హాల్ నుండి ఇతరులందరినీ బయటకు పంపిన ఘటన తీవ్ర ఉత్కంఠను రేపింది.
Read Also: KTR: కాళేశ్వరంను చిల్లర రాజకీయాలకోసం వాడుతున్నారు.. కేటీఆర్ బోల్డ్ కామెంట్స్..!
ఈ క్రమంలో కేసీఆర్ ఓపెన్ కోర్టులో స్వయంగా హాజరయ్యారు. జస్టిస్ ఘోష్ ఆయనను ప్రత్యక్షంగా ప్రశ్నించడమే కాకుండా, అన్ని విషయాల్లో వాస్తవాలను తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా విచారణ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో BRK భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమ నేత కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Gold Prices: బంగారు ప్రియలకి ఝలక్.. భారీగా పెరిగిన పుత్తడి ధర..!
కొందరు కార్యకర్తలు బారికేడ్‌లు దాటి ముందుకు రావడంతో పోలీసులతో తోపులాట జరిగింది. పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు మరింత ఉగ్రంగా నినాదాలు చేస్తూ కేసీఆర్‌కు సంఘీభావం తెలియజేశారు. ఇప్పటికే కేసీఆర్‌ను విచారించడంపై రాజకీయ వర్గాల్లో పెద్దెత్తున చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణను కక్ష సాధింపు చర్యగా ఉపయోగించుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు అధికార పక్షం మాత్రం న్యాయపరంగా ఇది అవసరమైన చర్యేనని స్పష్టం చేస్తోంది.