KTR: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికొద్దిసేపట్లో కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై ఘాటు విమర్శలు చేసారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also: KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్‌కే భవనం వద్ద భారీగా పోలీసు బందోబస్తు..!
కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని, ప్రభుత్వ పరిపాలన విజయాలను గుర్తు చేస్తూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత 60 ఏళ్లలో ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులు కేసీఆర్ సాధించారు. ఆయన జీవితం ఓ చరిత్ర. ప్రజాస్వామ్య పోరాటం ద్వారా కోట్లాది మందిలో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారు. కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ ఆకలి తీరాలన్న ధ్యేయంతో జీవించిన నాయకుడు కేసీఆర్ మాత్రమే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను కమిషన్ ఎదుట నిలబెట్టడంపై తీవ్రంగా స్పందిస్తూ, కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే మీకు పైశాచిక ఆనందం కలుగుతుందేమో కానీ, ఆయన ఖ్యాతికి ఎలాంటి మచ్చ పడదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడని పేర్కొన్నారు.
Read Also: Palla Rajeshwar Reddy: జారిపడ్డ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హాస్పిటల్‌కి తరలింపు..!
అలాగే కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదని ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అంటూ రాసుకొచ్చారు.
కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు
ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…
మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!
బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ
— KTR (@KTRBRS) June 11, 2025
His story is History
He did a miracle that wasn’t possible for 60years!
He ran a democratic campaign with nothing but pure passion for Telangana
He agitated for a separate state, a dream of millions of people
He quenched the thirst of Telangana with Kaleshwaram
One… pic.twitter.com/2hHbYDWJcZ
— KTR (@KTRBRS) June 11, 2025