KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ చేపట్టిన విచారణ ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం. అంతేగాక పలు డాక్యుమెంట్లు కూడా కమిషన్‌కు ఆయన సమర్పించారు.
Read Also: MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!
అలాగే విచారణలో కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడిగగా.. కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదం తోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్నారు కేసీఆర్. అలాగే వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు కేసీఆర్. ఇక చివరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన పుస్తకాన్ని కమిషన్ కు అందచేశారు కేసీఆర్. విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి.. నేటి విచారణలో ఇచ్చిన సమాధానాలను పరిశీలించి, వాటిపై సంతకాలు చేసారు. ఈ విచారణలో వన్ టూ వన్ విధానాన్ని అనుసరించడంపై కొన్ని విమర్శలు వచ్చినా, కమిషన్ వర్గాలు దీనిపై స్పందించాయి. కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడంతో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టూ వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి.
Read Also: KCR Enquiry: ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ.. BRK భవన్ వద్ద పెద్దెత్తున ఆందోళనలు..!
విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ సోమజిగూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిను పరామర్శించారు. నేడు ఉదయం ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసంలో ఆయన జారిపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.