TPCC Mahesh Goud : మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావును ఉద్దేశించి స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా?” అని ప్రశ్నించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ఆస్తులు విలువ తగ్గించిన విధానాన్ని…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్ కమిషన్ హాజరు సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచి రేపు కేటీఆర్ హైదరాబాద్‌కు రానున్నారు. జూన్ 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఇదే రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదకపై నిర్మాణ సంస్థపై చర్యకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.…
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.
KCR-Harish Rao : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై…
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లోనే అని విమర్శించారు. ఎన్ని కుట్రలు సృష్టించినా.. ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందన్నారు. అశాస్త్రీయ ఆరోపణలను ఎల్ అండ్ టీ ఖండించండం సంతోషమన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, కేసీఆర్ గారు దూరదృష్టి గల…
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు.
Breaking News : బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాల నడుమ, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాం హౌస్‌కి వెళ్లినట్లు సమాచారం. ఈ భేటీలో కవిత లేఖతో పాటు, ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై వచ్చిన నోటీసుల అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం…
Uttam Kumar Reddy : హుజూర్‌నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే…