Pawan Kalyan: ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్.. మత్స్యకారుల ఇబ్బందులపై ఆరా
- కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటన..
- పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతం పరిశీలన..
- తుఫాన్.. ప్రకృతి విపత్తులతో సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారుల ఇబ్బందులపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.. అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు పవన్.. తుఫాన్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. గతంలో జరిగిన ఘటనలను ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా.. అవి తిలకించిన పవన్.. వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. సముద్ర కెరటాలు దాటికి మాయపట్నం నుంచి కొత్తపట్నం వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయని పరిశీలించారు.. చెన్నై నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ పోస్టల్ రీసెర్చ్ బృందంతో తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.. అమీనాబాద్ ను పరిశీలించారు.. తీర ప్రాంత ప్రజల రక్షణకు తీసుకోవలసిన చర్యలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించారు డిప్యూటీ సీఎం.. వాకతిప్ప గ్రామంలో సూరప్ప త్రాగునీటి చెరువును పరిశీలించి, మంచినీటి లైన్ ఏ విధంగా వెళ్తుంది.. వాటర్ ఏవిధంగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అడిగి తెలుసుకున్నారు..
Read Also: Deputy CM Pawan Kalyan: బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్ ఆపిన పవన్.. న్యాయం చేస్తానని హామీ
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇక, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు పవన్.. నా బార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక, కొండేవరంలో గతవారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ కాన్వాయ్ వెళ్తుంటే ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.. వారిని చూసి ఆగిన డిప్యూటీ సీఎం సమస్య అడిగి తెలుసుకుని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో కృతజ్ఞతా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!