AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇదే సమయంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు నేతలు.. అయితే, ఎన్నికల సమయంలో ప్రలోభాలు కామన్‌గా మారిపోయాయి.. గెలుపు కోసం గిఫ్ట్‌లు, డబ్బులు పంచుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఇక, విచిత్రం ఏంటంటే.. నోటు ఇస్తేనే ఓటు అంటున్నారు జనం.. అసలు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు? అని గొడవకు దిగుతున్నారంటే నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
Read Also: Rajasthan: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మృతి
పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.. దీంతో, క్లైమాక్స్‌లో బ్యాక్ డోర్ తెరుస్తున్నాయి రాజకీయ పార్టీలు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఓటుకు రేటు కట్టి అమ్మేస్తున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ఎక్కడికక్కడ.. డబ్బు సంచులు దించడం.. ఓటర్లకు పంచేయడం చేస్తున్నారు. గ్యారెంటీగా తమకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్న వ్యక్తులకు రెండేసి వేలు.. అవసరాన్ని బట్టి రూ.5 వేల వరకు పంచుతున్నట్టు టాక్ నడుస్తోంది. మరీ విచిత్రం ఏంటంటే.. కోనసీమలో కొత్తపంచాయతీ తెరపైకి వచ్చింది.. మడికి గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు.. అదేదో మంచినీళ్లు రోడ్ల సమస్య పరిష్కారానికి కాదు.. కొన్ని పార్టీలు ఓట్ల కోసం చీరలు ఇచ్చి సరిపెడుతున్నాయట.. అయితే, తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. అలమూరు మండలం పెదపళ్లలో చీరలు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళలు ఆగ్రహంతో మండిపడ్డారు. చీరలు తీసుకెళ్లి నాయకుడి ఇంటి ముందు పడేశారు.. ఇది లోకల్‌గా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు.. కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ధర్నాకు దిగారు. దాదాపు వంద కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక నేతలు కొట్టేశారని మండిపడ్డారు కొండెవరం గ్రామస్తులు. ఇక, ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన కొన్ని కుటుంబాలు ఓటుపై వినూత్నంగా ప్రచారం చేపట్టాయి.. తమ ఓటు ఎవ్వరికీ అమ్మబడువు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. నిజాయితీగా మాకు అభివృద్ధి చేసే నాయకుడ్ని ఎన్నుకుంటామని కరాకండీగా చెబుతున్నారు.. ఇలా ఎన్నికల వేళా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి..