'పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది.. నా అక్క గీతమ్మ నిలబడుతోంది.. పిఠాపురంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. లోకల్ హీరో కావాలా? లేకపోతే సినిమా హీరో కావాల్నా ఆలోచన చేసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో పర్యటించారు. రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అధ్వాన్నపు రహదారుల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్‌లు కోరారు. Also Read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..! ప్రతి…
రాబోయే ఎన్నికల్లో జనేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి పవన్ కల్యాణ్కు సవాల్ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.