Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
Kakani Govardhan Reddy: గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతల దాడులు తీవ్రమవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రషీద్ ను దారుణంగా హతమార్చారు.. అంతరంగిక వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు.. ఇది పద్దతి కాదు.. కొందరు టీడీపీ నేతలు మాత్రం ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని ప్రచారం చేశారు
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతోంది.. బాధ కూడా కలుగుతోందన్నారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం.
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని,…
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు అమలకు సాధ్యం కానీ, హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కావాలా.. చెప్పిన వన్నీ చేసి చూపిన జగన్ కావాలో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మెదరమెట్ల జరిగిన సిద్ధం సభను చూసి చిలకలూరిపేటలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పిలిచినా.. సభ అట్టర్ ప్లాప్ అయింది అని ఆరోపించారు. సర్వేపల్లి నియోజవర్గానికి టీడీపీ అభ్యర్థిని నిలపలేకపోతున్నారు అని మంత్రి అన్నారు.