Kakani Govardhan Reddy: గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతల దాడులు తీవ్రమవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రషీద్ ను దారుణంగా హతమార్చారు.. అంతరంగిక వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు.. ఇది పద్దతి కాదు.. కొందరు టీడీపీ నేతలు మాత్రం ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని ప్రచారం చేశారు.. హంతకుడు జిలానీ టిడిపికి చెందిన వారు అని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసు.. హత్యకు సూత్రధారులను గుర్తించాలి అని మాజీ మంత్రి కాకానీ డిమాండ్ చేశారు.
Read Also: Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
ఇక, రేపు రషీద్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు అని కాకానీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. మాజీ లోక్ సభ సభ్యుడు రెడ్డెప్ప ఇంటికి
ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.. పోలీసులు వీడియో గ్రాఫర్ల పాత్ర పోషించారే తప్ప రక్షణ ఇవ్వలేదు అని మండిపడ్డారు. చివరకు మిథున్ రెడ్డి గన్ మెన్లు గాలిలోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పాడింది.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి.. మూడు వేల కుటుంబాలు గ్రామాలు వదిలి వలస వెళ్లారు అని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Read Also: Jagapathi Babu: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను.. జగ్గు భాయ్ పోస్ట్ వైరల్..
ఇక, మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని మాజీ మంత్రి కాకానీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. ముచ్చుమర్రిలో బాలిక శవం కూడా దొరకడం లేదు.. మూడు రోజుల్లో హోంమంత్రి మాటలు చూసి ఎంతో మురిసిపోయాము.. ఇప్పుడు ఆమె ఎక్కడుందో కనపడటం లేదు.. వైసీపీ నేతల మీద దాడులు పెరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.. ఇలాంటి సంప్రదాయాలు తీసుకురావడం సరికాదు.. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి.. ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా చేస్తామన్న పవన్.. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటం లేదు అని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించరు.. ఎవరు ఇవ్వలేని పాలనను ఇస్తామని టీడీపీ- జనసేన- బీజేపీ నేతలు అంటే ఏమో అనుకున్నాము.. ఇదే వాళ్ళు చేస్తున్న పాలన అని కాకానీ గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.