Kakani Govardhan Reddy: ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి.. బాటిల్ చూపించి పదే పదే చూపించారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన…
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్లదిన్నెకు చెందిన టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్.. కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద…
Kakani Govardhan Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతోనే నా పైనా కేసు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇక, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు అని మాజీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు..
తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు... ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Kakani Govardhan Reddy: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు.. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపణలు చేశారు.