Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతోంది.. బాధ కూడా కలుగుతోందన్నారు. ఇచ్చిన హమీలను జగన్ నెరవేర్చారు. పాలనలో ఎన్నో సంస్కరణలను జగన్ తీసుకొచ్చారు.. కానీ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి.. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Aswani Dutt: అశ్వనిదత్ కి టీటీడీ చైర్మన్ పదవి?
అధికారం ఉన్నప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యామో.. అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతోనే ఉంటామని వెల్లడించారు కాకాణి.. పార్టీ కోసం పనిచేసిన నేతలు.. కార్యకర్తలకు అండగా ఉంటామన్న ఆయన.. ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదు అని ధైర్యాన్ని చెప్పారు. ఓటమికి కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళ్తాం అన్నారు… ప్రజలు ఎందుకో ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపలేదన్నారు. అయితే, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ముఠగట్టుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 11 స్థానాలకే పరిమితమైన విషయం విదితమే.