నెల్లూరు జిల్లాలో పోదలకూరులో వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రచార సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేశారు.. జగన్ ను ఎదుర్కోలేక 2014 లాగా మళ్ళీ ముగ్గురూ జత కట్టారు అని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా ఉంటామే తప్పా.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టం అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: Junk Food: ‘జంక్ ఫుడ్’ తిన్నందుకు తండ్రి మందలింపు.. విద్యార్థిని ఆత్మహత్య..
బీజేపీకి మద్దతు ఇవ్వబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు అమలకు సాధ్యం కానీ, హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కావాలా.. చెప్పిన వన్నీ చేసి చూపిన జగన్ కావాలో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మెదరమెట్ల జరిగిన సిద్ధం సభను చూసి చిలకలూరిపేటలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పిలిచినా.. సభ అట్టర్ ప్లాప్ అయింది అని ఆరోపించారు. సర్వేపల్లి నియోజవర్గానికి టీడీపీ అభ్యర్థిని నిలపలేకపోతున్నారు అని మంత్రి అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవడు అనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి.. అనేక మందిని అభ్యర్థులను అన్వేషిస్తూన్నారు. చివరకు గతి లేక మళ్లీ సోమిరెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తుందని మంత్రి కాకాణి అన్నారు.