అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చటానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, చంద్రబాబు పుణ్యమా అని రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. యూరియా కోసం రైతులు పడే అగచాట్లు ఈ ప్రభుత్వ పెద్దలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ తెచ్చామని చెప్తున్న యూరియా ఏమైంది?, రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్‌లోకి ఎలా…
Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా…
నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్‌కి చేరుకున్నారు.
యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు..
ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి... నాటకాల రాయుళ్లు అందరూ ఒక్కో డ్రామా వేస్తున్నారు.. అందులో ర్యాంకింగ్ ఇస్తే శ్రీధర్ రెడ్డికి నంబర్ వన్ స్థానం వస్తుందని ఎద్దేవా చేశారు.. రౌడీ గ్యాంగ్‌లను పెంచిపోషించింది శ్రీధర్ రెడ్డి కాదా..? అని నిలదీశారు.. పెరోల్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టే.. దానిని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు..
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.